‘మీ డై హార్ట్‌ ఫ్యాన్‌’ అంటూ.. అసభ్యకర రీతిలో పోస్టులు

23 Jun, 2021 09:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాధితురాలి ఫిర్యాదు

సాక్షి, హిమాయత్‌నగర్‌: ఇన్‌ఫ్లూ్యన్సెర్‌కు మీ డై హార్ట్‌ ఫ్యాన్‌ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడు. మలక్‌పేటకు చెందిన ప్రియారెడ్డికి ఇన్‌స్ట్రాగామ్‌లో 3.46లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె చేసే వీడియోలు, డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌ వంటి వీడియోస్‌కు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి ఇటీవల ‘మీ డైహార్ట్‌ ఫ్యాన్‌’ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో కొన్ని ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత నుంచి ప్రియారెడ్డిని డబ్బు ఇవ్వాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. ఫ్యాన్‌ అని ఇలా బ్లాక్‌మెయిల్‌ చేస్తావా అని ప్రశ్నించినందుకు ఆమె వీడియోస్‌కు పోర్న్‌స్టార్స్‌ బాడీని ఎటాచ్‌ చేసి యూట్యూబ్, ఇతర వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేశాడు.

తన కుమారుడు, కుటుంబ సభ్యులపై కూడా అశ్లీల మెసేజ్‌లను ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌లోని అందరికీ పంపించాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ప్రియారెడ్డి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. ఈ వ్యవహారంపై మే 16వ తేదీన సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కొన్ని వీడియోస్‌ను, అకౌంట్స్‌ని డిలీట్‌ చేయడం జరిగింది. మరికొన్ని వెబ్‌సైట్స్, ఇన్‌స్టా, యూట్యూబ్‌ల్లో అసభ్యకర రీతిలో పోస్టులు, కామెంట్స్‌ పెట్టిన వారిపై సైతం చర్యలు తీసుకోవాలని మంగళవారం మరోమారు ప్రియారెడ్డి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 

మరిన్ని వార్తలు