నవంబర్‌ 15న బంజారాహిల్స్‌తోపాటు ఈ ప్రాంతాలకు నీళ్లు బంద్‌

13 Nov, 2021 21:27 IST|Sakshi

15న పలు ప్రాంతాలకు నీటిసరఫరా బంద్‌.. 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 15న సోమవారం పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. పంజగుట్ట శ్మశాన వాటిక ఎదురుగా రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో అక్కడున్న 1000 ఎంఎం డయా ఎయిర్‌ వాల్వ్‌ను మరోచోటకు మార్చాల్సిన  నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల కారణంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని తెలిపింది. నిర్వహణ డివిజన్‌ 6లో ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, ఎస్‌ఆర్‌నగర్, వెంగళ్‌రావునగర్, సోమాజిగూడ, వెంకటగిరి సెక్షన్‌ల పరిధిలోని ప్రాంతాల్లో, నిర్వహణ డివిజన్‌ 9లో మూసాపేట సెక్షన్‌ పరిధిలోని పాండురంగానగర్, కబీర్‌నగర్‌ ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు. 

నిమ్స్‌కు నీటి సరఫరా బంద్‌ 
నిమ్స్‌కు 24 గంటలు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి  శుక్రవారం నిమ్స్‌ యాజమన్యానికి సర్కులర్‌ జారీ చేసింది. ఈ నెల 15వ తేది  సాయంత్రం నుంచి 16వ తేది రాత్రి వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 24 గంటల పాటు శ్రస్త చికిత్సలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు