Hyderabad: వ్యాధుల రొద.. రోగుల వరద!

2 Nov, 2021 08:48 IST|Sakshi
గాంధీ ఆస్పత్రిలో..

సాక్షి, హైదరాబాద్‌: అసలే కరోనా మహమ్మారి జడలు విప్పి నాట్యం చేస్తుంటే.. దీనికి తోడు ఇతర వ్యాధులూ నగర వాసుల్ని పట్టిపీడిస్తున్నాయనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. డెంగీ, మలేరియా, డయేరియా, విష జ్వరాలు జనాలను భయకంపితుల్ని చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. వందల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు దవాఖానాలకు పోటెత్తుతున్నారు. సోమవారం గాంధీ, నిలోఫర్, ఫీవర్‌ ఆస్పత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చికిత్స కోసం గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించడం వ్యాధుల తీవ్రతకు దర్పణం పడుతోంది. 
చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు.. 

ఫీవర్‌ ఆస్పత్రిలో క్యూలైన్‌.. 

      

నిలోఫర్‌ ఆవరణలో కిక్కిరిసి..

మరిన్ని వార్తలు