‘డూ యూ హ్యావ్‌ స్టఫ్‌’ అని అడిగిన వారికే ఇస్తా..

8 Jul, 2021 11:33 IST|Sakshi
జోసఫ్‌

కొకైన్‌ ఫ్రమ్‌ ‘లిల్లీ’ 

పోలీసుల విచారణలో కొకైన్‌  నిందితుడు జోసఫ్‌ వెల్లడి

హిమాయత్‌నగర్‌: ఇటీవల నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొకైన్‌ అమ్ముతూ పట్టుబడ్డ ఘనా దేశస్థుడు జోసఫ్‌కు జూన్‌ 24న కోర్టు రిమాండ్‌ విధించింది. మరింత సమాచారం కోసం నారాయణగూడ పోలీసులు సోమవారం జోసఫ్‌ను కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పలు విషయాలను అతను బయటపెట్టాడు.  

లిల్లీ నుంచే సరుకు... 
ముంబాయిలో అక్కడి ఫ్రెండ్స్‌ ద్వారా పరిచయ మై న లిల్లి అనే వ్యక్తి నుంచి కొకైన్‌ వంటి మాదక ద్రవ్యా లను ఒక్కో గ్రాము సుమారు రూ.4వేలకు  ఇచ్చేవా డని, దానిని తాను రూ.5వేల నుంచి రూ.6వేలకు ఇతరులకు అమ్మేవాడినంటూ చెప్పినట్లు తెలిసింది. ముంబాయి నగరంలో కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉండటంతో అక్కడి పబ్స్, బార్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ మూతపడడంతో హైదరాబాద్‌లో అమ్మాలనే ఆలోచనతో నెల రోజుల క్రితం ముంబై నుంచి బస్సులో నగరానికి వచ్చి కొద్దిరోజుల పాటు తెలిసిన స్నేహితుల వద్ద నివాసం ఉన్నాడు. రాజమోహల్లా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు ఉందని పేపర్‌ యాడ్‌లో చూసి ఆ ఇంటి వారికి పాస్‌పోర్ట్‌ చూపించి ఇద్దరం ఉంటామని అద్దెకు దిగాడు. 

డూ యూ హ్యావ్‌ స్టఫ్‌ అన్న వారికే... 
నేను ఎవరి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తానని చెప్పన్నక్కర్లేదు. నా ముఖం చూసి వారే ‘డూ యూ హ్యావ్‌ స్టఫ్‌’ అంటూ అడుగుతారు. అలా అడిగిన వారికి మరుసటి రోజు సాయంత్రం లేదా ఆ తర్వాతిరోజు(ఎల్లుండి) సాయంత్రం ఏదైనా ల్యాండ్‌మార్క్‌ చెప్పేవాడిని. అలా అక్కడకు వచ్చిన వారికి నా వద్ద ఉన్న కొకైన్‌ అమ్మకాలు చేశాను. ఇక నా గర్ల్‌ఫ్రెండ్‌ నన్ను చూడటానికి వచ్చిందని అనుకుంటున్నాను. ఆమె వచ్చిన మరుసటి రోజే నేను పోలీసులకు పట్టుబడ్డాను కాబట్టి ఇంకా వేరే కారణాలు తెలియవంటూ పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఎంత సరుకు అమ్మావు, ముంబై నుంచి ఎంత సరుకు తెచ్చావు, ఇక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే సమాధానాలను మాత్రం పోలీసులు జోసఫ్‌ నుంచి రాబట్టలేకపోయారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు