డ్రైనేజీ మృతుల కుటుంబాలకు డబుల్‌ ఇళ్లు

17 Aug, 2021 08:18 IST|Sakshi

సాక్షి, ఎల్‌బీనగర్‌( హైదరాబాద్): బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌లోని పద్మావతినగర్‌ కాలనీలో ఇటీవల డ్రైనేజీ పూడికతీత పనుల్లో మరణించిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు చెరో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం నగర మేయర్‌ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మేయర్‌ చాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను  శివకుమార్‌ భార్య ధరణి శ్రావణిగౌరి, అంతయ్య భార్య నల్లవెల్లి భాగ్యమ్మకు అందచేశారు. వనస్థలిపురంలోని రైతుబజార్‌ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ప్లాట్లలో 701 నెంబర్‌ను భాగ్యమ్మకు, 702 ప్లాట్లును శ్రావణి గౌరికి కేటాయించారు. ఇప్పటికే వీరికి రూ.17 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు