ఎయిర్‌పోర్ట్‌ మెట్రోపై ‘విదేశీ’ ఆసక్తి.. జనరల్‌ కన్సల్టెంట్‌దే కీలక పాత్ర 

22 Dec, 2022 13:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించే జనరల్‌ కన్సల్టెంట్‌ నియామకానికి సంబంధించి నిర్వహించిన అర్హత అభ్యర్థన (రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌)కు పలు విదేశీ సంస్థల నుంచి పలు బిడ్‌లు దాఖలయ్యాయి.

ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్, సౌత్‌ కొరియా, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు చెందిన కంపెనీలున్నాయి. మొత్తంగా 13 ప్రతిష్టాత్మక దేశ, విదేశీ సంస్థలు అయిదు కన్సార్షియంలుగా ఏర్పడి ప్రీ క్వాలిఫికేషన్‌ బిడ్‌లు దాఖలు చేసినట్లు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఆయా కన్సార్షియంలు దాఖలు చేసిన బిడ్‌లను మూల్యాంకన ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. 
చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌

బిడ్‌ దాఖలు చేసిన కన్షార్షియంలు ఇవే.. 
►సిస్ట్రా (ఫ్రాన్స్‌), ఆర్‌ఐటీఈఎస్‌ (ఇండియా, డీబీ ఇంజినీరింగ్‌ అండ్‌ కన్సల్టింగ్‌(జర్మనీ). 
►ఆయేసా ఇంజనెర్సియా ఆర్కెటెక్ట్రా (స్పెయిన్‌),నిప్పాన్‌ కోయి (జపాన్‌), ఆర్వీ అసోసియేట్స్‌ (ఇండియా). 
►టెక్నికా వై ప్రోయెక్టోస్‌ (టీవైపీఎస్‌ఏ–స్పెయిన్‌), పీనీ గ్రూప్‌ (స్విట్జర్లాండ్‌). 
►ఏఈకామ్‌ ఇండియా, ఈజిస్‌ రెయిల్‌(ఫ్రాన్స్‌), ఈజిస్‌ ఇండియా. 
►కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌ గ్రూప్‌ (ఇండియా), కొరియా నేషనల్‌ రైల్వే (సౌత్‌ కొరియా). 

జనరల్‌ కన్సల్టెంట్‌ నిర్వహించాల్సిన విధులివే.. 
►హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌కు అన్ని సాంకేతిక, ప్రాజెక్ట్‌ నిర్వహణ సంబంధిత విధుల్లో జనరల్‌ కన్సల్టెంట్‌ ఏజెన్సీ సహాయం చేస్తుంది. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ కింది విధులు నిర్వహించాల్సిఉంటుంది. 

►సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికను సమీక్షిస్తుంది. టెండర్‌ డాక్యుమెంటేషన్‌ ,మూల్యాంకనం చేపడుతుంది. డిజైన్‌ మేనేజ్‌మెంట్‌. వివిధ రకాల కాంట్రాక్టర్లు, సరఫరాదారులు సమర్పించిన డిజైన్‌లు,డ్రాయింగ్‌ల ప్రూఫ్‌ చెక్‌ చేస్తుంది. దస్తావేజు నియంత్రణ. 

►ప్రాజెక్ట్‌ ప్రణాళిక. ఇంటర్ఫేస్‌ నిర్వహణ. నిర్మాణ నిర్వహణ. నాణ్యత హామీ, నాణ్యత నియంత్రణ. ఆరోగ్యం, భద్రత నిర్వహణ, కాంట్రాక్ట్‌ అడ్మిని్రస్టేషన్, పునరుత్పాదక శక్తి వ్యవస్థ, లోపాలు సరిదిద్దడంతో సహా అంగీకార ప్రమాణాలు సరిపోలుస్తుంది. ఓఅండ్‌ఎం ప్రణాళిక. హెచ్‌ఏఎంఎల్, మెట్రో సిబ్బందికి శిక్షణ. ప్రాజెక్ట్‌ కోసం సెక్యూరిటీ ఆడిట్‌ మొదలైన విధులు నిర్వహించాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు