Ind Vs Aus Tickets Issue: ఉప్పల్‌ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్‌.. అభిమానులతో ఆటలా!

22 Sep, 2022 14:28 IST|Sakshi
జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల కోసం అభిమానుల నిరీక్షణ 

సాక్షి, ఉప్పల్‌: ఈ నెల 25న ఉప్పల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్వహించే టీ– 20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్‌ను ఫిర్యాదు చేసింది. క్రికెట్‌ క్రీడాభిమానులకు టికెట్లు ఇవ్వకుండా బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలించడానికి హెచ్‌సీఏ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.


 


హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసిన పత్రాలతో ఏఐవైఎఫ్‌ ప్రతినిధులు

టికెట్లతో పాటు ఆట సమయంలో తిను బండారాలు, శీతల పానీయాలను సైతం అధిక రేట్లకు విక్రయించే యత్నాలపైనా విచారణ చేపట్టాలని కోరారు. కేవలం 25 శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించి 75 శాతం టికెట్లను బ్లాక్‌ మార్కెట్‌ చేయడానికి హెచ్‌సీఏ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఏఐవైఎఫ్‌ అధ్యక్షుడు వలి ఉలా ఖాద్రి,  రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎన్‌.శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర పాల్గొన్నారు.  

రసూల్‌పుర: ‘హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను రద్దు చేయాలి.. అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ను తొలగించాలి.. అజారుద్దీన్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ క్రికెట్‌ అభిమానులు జింఖానా గ్రౌండ్‌లో నినాదాలు చేశారు. భారత్‌– ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న టీ– 20 మ్యాచ్‌ నేపథ్యంలో.. టికెట్ల కోసం వేలాది మంది జింఖానా మైదానానికి వచ్చారు. టికెట్లు విక్రయించాలంటూ గోడ దూకి గ్రౌండ్‌ లోపలికి చేరుకున్నారు. 
చదవండి: జింఖానా గ్రౌండ్‌ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్‌ సీపీ

టికెట్లు ఇచ్చేవరకూ తిరిగి వెళ్లేది లేదంటూ అక్కడే బైఠాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్ల కోసం వచ్చామని.. తీరా చూస్తే వాటిని అమ్ముకున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు