Amit Shah: సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న అమిత్‌ షా

8 Feb, 2022 20:38 IST|Sakshi

కేంద్ర హోంశాఖ మంత్రి ముచ్చింతల్‌లోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని, సమతామూర్తి విగ్రహం ఏకతా సందేశాన్ని అందిస్తోందన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. తిరునామం, పంచెకట్టుతో వచ్చిన అమిత్‌ షా.. ముచ్చింతల్‌‌లోని దివ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కేంద్రం విశిష్టతను చినజీయర్‌ స్వామి హోంమంత్రికి వివరించారు. అనంతరం శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు.

సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. 

సాక్షి,  హైదరాబాద్ :  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్‌ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, బిజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు