రికార్డు బ్రేక్‌ చేసిన బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం..

9 Sep, 2022 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ శుక్రవారం జరిగిన వేలం పాటలో రికార్డు బ్రేక్‌ చేసింది. వేలంలో రూ. 24.60 లక్షలు పలికింది. లడ్డూను బాలాపూర్‌ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్‌ లడ్డూ రూ. 18.90 లక్షలు పలకగా..  అప్పటి కంటే ఈసారి లడ్డూ ధర 5.70 లక్షలు అధికంగా పలికింది.

కాగా ఈ సంవత్సరం బాలాపూర్‌ గణపతి లడ్డూ వేలం పాటల 13 మంది పాత సభ్యులు, 8 మంది కొత్తవారు పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులు లడ్డూ వేలంలో పాటకు హాజరయ్యారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సైతం హాజరయ్యారు. వేలం పాట అనంతరం బాలాపూర్‌ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మదీనా, చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌ మీదుగా శోభాయాత్ర సాగనుంది. 
 

మరిన్ని వార్తలు