బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్‌.. ఐపీఎల్‌ బెట్టింగ్‌లో..

12 May, 2022 12:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వనస్థలీపురం బ్యాంక్‌ చోరీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్‌లో నష్టపోయి చోరీ చేశానంటూ క్యాషియర్‌ ప్రవీణ్‌.. బ్యాంక్‌ మేనేజర్‌కి మెసేజ్‌ చేశాడు. బెట్టింగ్‌లో వచ్చేస్తే తిరిగిస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బ్యాంకు ఉద్యోగులకు సమాచారమిచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, రెండ్రోజుల కిత్రం బ్యాంకులో 22 లక్షల 53వేలతో క్యాషియర్‌ ప్రవీణ్‌ పరారయ్యాడు. బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్‌ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

చదవండి: (పెళ్లింట పెనువిషాదం: జీలకర్ర బెల్లం సమయానికి కుప్పకూలిన వధువు)

మరిన్ని వార్తలు