కపోత విషాద గీతిక! 

18 Jan, 2022 08:17 IST|Sakshi

చైనా మాంజా ప్రాణాంతకంగా మారుతోందనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో మాంజా ఓ వ్యక్తిని బలిగొనడం విషాదాన్ని నింపింది. సోమవారం నగరంలోని నెక్లెస్‌ రోడ్డులోని విద్యుత్‌ స్తంభానికి చిక్కుకుపోయిన మాంజా.. పావురం మెడకు చుట్టుకుని నిలువునా దాని ప్రాణాలను తీసింది. ఊపిరి పోతుండగా అది స్తంభంపైనుంచి విగతజీవిగా నేలపై పడుతూ అకటా.. దయలేని వారు ఈ మానవులు! అనే విషాద గీతికను ఆలపిస్తున్నట్లు.. ఆ కపోతం కన్నీరు కారుస్తున్నట్లు కనిపించిందీ దృశ్యం.

 

మరిన్ని వార్తలు