ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజుపై విపక్షాల విషం

26 May, 2023 06:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజుపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని, నిబంధనల ప్రకారమే ఐఆర్‌బీకి టోల్‌గేట్‌ టెండర్లు దక్కాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానంద అన్నారు. లీజుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

వారు గురువారం బీఆర్‌ఎస్‌ఎలీ్పలో విలేకరులతో మాట్లాడుతూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 111 జీవోపై కాంగ్రెస్, బీజేపీ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని, ఆ గ్రామాలకు వెళ్లి జీవో కొనసాగాలని కోరే ధైర్యం ఉందా? అని నిలదీశారు. రాజకీయాల గురించి గవర్నర్‌ మాట్లాడడం సరికాదని, ఆమెకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు.   

మరిన్ని వార్తలు :


Advertisement

ASBL
మరిన్ని వార్తలు