గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

23 Aug, 2021 11:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 41 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందన్నారు. రాష్ట్రానికి కోటి 68లక్షల 61వేల 809 వ్యాక్సిన్ డోసులు పంపించినట్లు తెలిపారు.13.18లక్షల డోసులు తెలంగాణలో నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్ ఉచితంగా  అందిస్తామని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు