ఓరి నాయనో.. డెలివరీ బాయ్స్‌లా వేషం, బ్యాగ్‌లో ఫుడ్‌ కూడా!

24 May, 2021 08:04 IST|Sakshi
ఆదివారం లాక్‌డౌన్‌ సడలింపు సమయం ముగిశాక రోడ్లపైకి వచ్చిన వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వీరిని ఇలా ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో ఉంచి జరిమానాలు విధించారు. 

రోడ్డెక్కడానికి అడ్డదారి!

పాత పాసులతో పాటు నకిలీవి వినియోగం 

ఒకప్పటి మందుల చీటీలూ తెస్తున్న వైనం 

డెలివరీ బాయ్స్‌ అవతారంలో అనేక మంది 

వారి పరిస్థితిని బట్టి స్పందిస్తున్న పోలీసులు 

లాక్‌డౌన్‌ నిబంధనల అమలుకు గట్టి చర్యలు 

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను అడ్డుకోవడానికి ఉద్దేశించిన లాక్‌డౌన్‌ను నగరంలో శనివారం నుంచి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా బయటకు వచి్చన వారిపై చెక్‌ పోస్టుల్లోని పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనేక మంది యువకులు బయట  సంచరించడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ పాసులు, గడువు ముగిసిన లెటర్లు, పాత తేదీలతో ఉన్న మందుల చీటీలను చూపించి పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ తరహాకు చెందిన ఉదంతాలు వందల సంఖ్యలో వెలుగు చూశాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పాసులు, లెటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అడ్డదారులు తొక్కుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.     
–సాక్షి, సిటీబ్యూరో

‘‘చిలకలగూడ ప్రాంతానికి చెందిన ఓ చికెన్‌ షాపు నిర్వాహకుడు తన వాహనంపై ప్రెస్‌ అని రాయించాడు. ఇతడి వాహనాన్ని ఆపిన పోలీసులు గుర్తింపు కార్డు అడిగారు. అప్పుడు కానీ అతగాడు అసలు విషయం చెప్పలేదు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ప్రెస్‌ అని రాయించినట్లు చెప్పడంతో వారు అవాక్కయ్యారు.’’ 

గ్రేటర్‌లో ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అత్యవసర సేవలతో పాటు కీలకాంశాలకు సంబంధించి బయటకువచి్చన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వారు బయటకు రావడానికి వినియోగించిన వాహనాన్ని స్వా«దీనం చేసుకుంటున్నారు. వీటిని లాక్‌డౌన్‌ తర్వాతే తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.  
(చదవండి: ఒకే పెళ్లి పందిట్లో అక్కాచెల్లెళ్లకు తాళికట్టిన యువకుడు !)

► అత్యవసర ప్రయాణాలు, వ్యవసాయ అవసరా లు, ఇతర తప్పనిసరి అంశాల కోసం పోలీసు వి భాగం ఈ–పాస్‌ జారీ చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారు తెలిపిన కారణాలతో పాటు ఇతర పూర్వాపరాలు పరిశీలించి వీటిని ఇస్తున్నారు. 

► ఈ పాస్‌లు తమకు రావని భావిస్తున్న వారితో పాటు సరదాగా బయట సంచరించాలనే ఉద్దేశంతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో వాహనాలపై ప్రెస్‌ అని రాయించుకుంటున్నారు. 

► మరికొందరైతే గత ఏడాది జారీ చేసిన పాసులతో తిరుగుతున్నారు. ఇంకొందరు ఆకతాయిలు వేరే వారికి జారీ చేసిన పాసుల్లో మార్పు చేర్పులు చేసుకుని తమ వాహనాలపై ఏర్పాటు చేసుకుని సంచరించే ప్రయత్నాలు చేస్తున్నారు.  

► వీరంతా ఒక ఎత్తయితే... డెలివరీ బాయ్స్‌ అవతారం ఎత్తుతున్న వారిది మరో ఎత్తు. ఫుడ్‌తో పాటు ఈ–కామర్స్‌ డెలివరీ సంస్థలకు చెందిన టీ–షర్టులు వేసుకుని, ఏదో ఒక బ్యాగ్‌ పట్టుకుని శని, ఆదివారాల్లో అనేక మంది రోడ్డెక్కారు. 

► ఇలా అడ్డదారులు తొక్కుతూ శనివారం వందల సంఖ్యలో మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పా టు చేసిన చెక్‌ పోస్టుల్లో చిక్కారు. ఈ కారణంగానే డెలివరీ బాయ్స్‌ను కూడా ఆపి తనిఖీ చేశారు.

► ఈ పంథాలో బయటకు వస్తున్న వాళ్లంతా ఆకతాయిలు కాదని పోలీసుల వివరిస్తున్నారు. అత్యవసర పనులపై వస్తున్న వారు, ఈ–పాస్‌ జారీ ఆలస్యమైన వాళ్లు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నారని వివరిస్తున్నారు. 

► దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చిక్కిన వారందరి ప ట్లా ఒకే వైఖరి అవలంబించట్లేదని చెబుతున్నారు. 

(చదవండి: పంటలపై ‘లాక్‌డౌన్‌’ పిడుగు)

మరిన్ని వార్తలు