టీచర్‌ కొట్టిందని పోలీస్‌ స్టేషన్‌లో...

18 Aug, 2021 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హోంవర్క్‌ చేయలేదని బాలుడుని కొట్టిన ట్యూషన్‌ టీచర్‌పై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా పాఠశాలలు లేకపోవడంతో బాపూనగర్‌కు చెందిన ఎస్‌.రిమ్షానా తన కుమారుడు తనిష్‌ను వెంగళరావునగర్‌లో ఉండే  మహిళ టీచర్‌ ఇంటికి ట్యూషన్‌కు పంపిస్తోంది.

కాగా ట్యూషన్‌కు వెళ్లేందుకు బాలుడు భయపడుతుండటంతో తల్లి గట్టిగా అడగడంతో తనిష్‌ తన ఎడమచేతిపై అయిన గాయాలను చూపించాడు.ఒంటిపై కూడా గాయాలు కనిపించాయి.హోంవర్క్‌ చేయడం లేదని టీచర్‌ రోజు తనను కొడుతుందని బాలుడు తెలుపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు టీచర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు  ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు