ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు

13 Jul, 2022 03:27 IST|Sakshi
డాక్టర్‌ దేబేంద్ర, డాక్టర్‌ ప్రథమ, డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి 

సీఆర్‌ఎస్‌ఐ నుంచి కాంస్య పతకాలు అందుకున్న శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమికల్‌ రీసెర్చ్‌ సొసై­టీ ఆఫ్‌ ఇండియా (సీఆర్‌ఎస్‌ఐ) నుంచి అరుదైన గుర్తింపు లభించింది. దేశ­వ్యా ప్తంగా రసాయన శాస్త్ర పరిశోధనలు చేస్తున్న 30 మంది శాస్త్రవేత్తలను కాంస్య పతకాలకు ఎంపిక చేయగా అందులో ఐఐసీటీలో సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌లుగా పని­చేస్తున్న డాక్టర్‌ ప్రథమ ఎస్‌.­మైన్‌కర్, డాక్టర్‌ దేబేంద్ర కె.మహాపాత్ర, ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డికి దర్శన్‌ రంగనాథన్‌ స్మారక ఉపన్యాసకుడిగా గుర్తింపు లభించింది. మొహాలీలో ఇటీవల జరి­గిన 29వ సీఆర్‌­ఎస్‌ఐ జాతీయ సదస్సులో ఈ అవార్డులను అందజేశారు. మెడిసినల్‌ కెమి­స్ట్రీ, కృత్రిమ సేంద్రియ రసాయన శాస్త్రం, కొత్త మందుల ఆవిష్కరణ వంటి రంగా­ల్లో డాక్టర్‌ ప్రథమ పరిశోధనలు చేస్తుండగా.. వైద్యానికి కీల­కమైన సంక్లిష్ట­మైన సహజ రసాయనాలు గుర్తిం­చేందుకు డాక్టర్‌ దేబేంద్ర కృషి చేస్తు­న్నారు. ఫార్మా రంగంతోపాటు సీఎస్‌ఐఆర్‌ వ్యవస్థలోనూ అనుభవం గడించిన డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి సేంద్రియ, మెడిసినల్‌ రసాయన శాస్త్ర రంగాలను మానవ సంక్షేమానికి వర్తించే దిశగా కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు