మహిళ తెలివి: లో దుస్తుల్లో బంగారం పేస్ట్‌..

3 Apr, 2021 14:26 IST|Sakshi
స్వాధీనం  చేసుకున్న బంగారం

షార్జా నుంచి వచ్చిన ప్రయాణికురాలి నుంచి 548 గ్రాముల బంగారం స్వాదీనం

సాక్షి, శంషాబాద్‌: షార్జా నుంచి వచ్చిన ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లో దుస్తుల్లో బంగారం పేస్టును రెండు ఉండలను గుర్తించారు. 548 గ్రాముల బరువు గల బంగారం విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 పట్టుబడిన విదేశీ కరెన్సీ

విదేశీ కరెన్సీ పట్టివేత 
హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకెళుతూ పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి జి–9541 విమానంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగేజీలో భారత కరెన్సీలో రూ.8.4 లక్షల విలువ చేసే యూఎస్, ఒమన్, యుఏఈ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: మిక్సీ గ్రైండర్, కటింగ్‌ ప్లేర్‌లో బంగారం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు