Desi Apple: డిమాండ్‌ ఎక్కువ.. ధర తక్కువ!

1 Sep, 2021 07:28 IST|Sakshi

100 కాయల బాక్స్‌ రూ.600–రూ.1000 

హోల్‌సేల్‌ మార్కెట్లో భారీగా తగ్గిన రేట్లు

వాతావరణం అనుకూలించడంతో పెరిగిన దిగుబడి

మార్కెట్లను ముంచెత్తుతున్న లోకల్‌ రకాలు

కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్న జనాలు

సాక్షి హైదరాబాద్‌: సిటీలో దేశీయ ఆపిల్స్‌ విరివిగా దొరుకుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లలో పెద్దమొత్తంలో దిగుమతులు పెరిగాయి. విదేశీ కంటే దేశీయ ఆపిల్స్‌ ధర తక్కువగా ఉండటం అగ్గువకు దొరుకుతుండటంతో చాలామంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. రిటైల్‌గా అమ్మేవాళ్లు, బండ్లపై వ్యాపారం చేసేవాళ్లు కూడా లోకల్‌ రకాలనే ఎక్కువగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దేశీయ ఆపిళ్ల దిగుబడి గణనీయంగా పెరిగిందని, అనువైన వాతావరణం ఉండటమే దీనికి కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

గడ్డి అన్నారం హోల్‌సేల్‌ ఫ్రూట్‌ మార్కెట్‌లో దిగుమతి పెరిగింది. ఈ ఒక్క మార్కెట్‌లోనే  ప్రస్తుతం 40 శాతం మేర దిగుమతి పెరిగిందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 14.59లక్షల బాక్సులు దిగుమతి అయ్యాయి. ఆరు నెలల క్రితం దేశీయ ఆపిల్‌ ఒక బాక్స్‌ ధర(కనీసం 100 కాయలు) రూ.1900– రూ.2000 ఉండగా, ప్రస్తుతం రూ.600–రూ.1000 ధర ఉంది. ఇంపోర్టెడ్‌ ఆపిల్స్‌ ఒక బాక్స్‌ ధర రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు అమ్ముడవుతోంది. 
చదవండి: Telangana: భయం లేకుంటేనే బడికి పంపండి

లోకల్‌ ఆపిల్స్‌కు డిమాండ్‌ 
నగరంలో ఇంపోర్టెడ్‌ ఆపిల్స్‌ కంటే లోకల్‌ రకాలకే డిమాండ్‌ ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి 70%, కశీ్మర్, డిల్లీ నుంచి 15% వరకు ఆపిళ్లు దిగుమతులు ఉంటాయి. అమెరికా, బంగ్లాదేశ్, మలేíÙయా, చైనా నుంచి మరో 15% వరకు ఇంపోర్టెడ్‌ ఆపిళ్లు దిగుమతి అవుతాయని మార్కెటింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. విదేశీ ఆపిళ్లు కేవలం పెద్ద పెద్ద మాల్స్‌లో మాత్రమే అమ్ముతుండటంతో సంపన్న వర్గాల వారు మాత్రమే వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. 

రేటు బాగా తగ్గింది 
గతేడాదికంటే ఆపిల్‌ పంట దిగుబడి పెరిగింది. సిటీలో ఇంపోర్టెడ్‌ ఆపిళ్ల కంటే ఇండియన్‌ రకాలనే ఎక్కువ కొంటున్నారు. రేటు తక్కువగా ఉండటం, అన్ని ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో లభిస్తుండటంతో జనాలు వీటినే కొనుగోలు చేస్తున్నారు. 
 – మహ్మద్‌ ఖుర్రం, హోల్‌సేల్‌ వ్యాపారి కొత్తపేట్‌ మార్కెట్‌

మరిన్ని వార్తలు