గణేశ్‌ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్‌ అనాల్సిందే!

20 Sep, 2021 17:01 IST|Sakshi

అకేషన్‌ ఏదైనా ఫొటో ఉండాల్సిందే. ఫోన్‌ చేతిలో ఉంటే ‘బొమ్మ’పడాల్సిందే. స్మార్ట్‌ఫోన్లు విరివిరిగా అందుబాటులోకి వచ్చాక ఫొటోలు తీయడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యాన్ని ఫోన్‌ కెమెరాలో బంధించేందుకు ఆరాటపడుతున్నారు జనం. ఇలాంటి దృశ్యమే హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన వేడుకల సందర్భంగా ఆవిష్కృతమైంది.

భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకుని భాగ్యనగర వాసులు పులకితులయ్యారు. అంతేకాదు శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిని తమ ఫోన్‌ కెమెరాలతో ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫోటోను హాయ్‌ హైదరాబాద్‌ ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. 

Photo Courtesy: Hi Hyderabad Twitter Page

గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో భాగంగా చార్మినార్‌ సమీపంలో తీసిన మరో ఫొటో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. శివుడి బాహువుపై ఆశీసుడైన గణనాథుడి ప్రతిమ వెనుక భాగంలో చార్మినార్‌ కనిపించే విధంగా తీసిన ఈ ఫోటో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Photo Courtesy: Hi Hyderabad Twitter Page

మరిన్ని వార్తలు