హైదరాబాద్‌: భారీ గోల్డ్‌ స్కామ్‌ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం

7 Oct, 2021 12:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన భారీ గోల్డ్‌ స్కామ్‌ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై డీఆర్‌ఐ 2019 కేసు ఆధారంగా హైదరాబాద్‌లో గుర్తింపు పొందిన శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌ మీద ఈడీ దాడులు చేస్తోంది. బంగారం దిగుమతి విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు 2019 డీఆర్‌ఐ కేసు ఆధారంగా ఈ సోదాలు జరుపుతోంది. శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడు సాయి చరణ్‌ను గతంలోనే డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌లో భారీ కుంభకోనం జరిగినట్టు ఈడీ గుర్తించింది.
చదవండి: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో .. ఈ వోటింగ్‌

విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేయడంతోపాటు, 1100 కిలోల బంగారాన్ని శ్రీ కృష్ణ జ్యువెలర్స్ డైవర్ట్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు. ఆభరణాల ఎగుమతుల్లో సైతం స్కామ్ చేసినట్టు గుర్తించారు. ఆభరణాల్లో పెట్టిన వజ్ర వైడూర్యాలకు సంబంధించి కూడా సరైన లెక్కలు చూపకపోవడంతో నగరంలో శ్రీ కృష్ణ జ్యువెలర్స్‌కి చెందిన షోరూంలు అన్నింటిలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జ్యువెలర్స్‌ 35 షోరూంలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఇదేం విడ్డూరం.. ఊళ్లో లేని వ్యక్తికి కరోనా టీకా!  

మరిన్ని వార్తలు