Hyderabad: నిత్య పెళ్లికొడుకు లీలలు, ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకొని..

14 Jul, 2022 08:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళలకు మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళి చేసుకుంటున్న నిత్య పెళ్ళి కొడుకు బండారం అతని ఇద్దరు భార్యలు బయటపెట్టారు. ఇప్పటివరకు 8 వివాహాలు చేసుకున్నట్లు, ఆ 8 మంది వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఇతనిపై కేసుపెట్టినట్లు నిర్ధారించారు. భాధిత మహిళలు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అడప శివశంకర్‌ బాబు.. మ్యాట్రిమోనీ ద్వారా వివాహమై భర్తను వదిలేసి డైవర్స్‌ తీసుకున్నవారు, డైవర్స్‌ కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నవారిని, ఉన్నత విద్య చదివినవారు, ఆర్థికంగా ఉన్నవారిని ఎంచుకుంటాడు.

తనకుకూడా వివాహమైందని వివిధ కారణాలతో విడిపోయామని నకిలీ విడాకుల పత్రం చూపించి సంబంధం కలుపుకుంటాడు. తాను పెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తానని నకిలీ ఐడీకార్డులు చూపిస్తాడు, నకిలీ పేస్లిప్‌ తయారు చేసి 2లక్షలు జీతం అని చెపుతాడు. తన తల్లిదండ్రులు చనిపోయారని నమ్మిస్తాడు. పెళ్ళి సమయంలో ప్రస్తుతం సమావేశానికి వచ్చిన నాలుగో భార్య 26 లక్షలు, ఐదవభార్య 35 లక్షలు నగదు, బంగారం రూపంలో కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు. నాకు 2లక్షల జీతం ఇంకా నీవు ఉద్యోగం చేయడం ఎందుకని వారిని ఇంట్లోనుండి బయటకు రాకుండా ఉద్యోగాలు మాన్పిస్తాడు. పెళ్ళైన రెండు నెలల్లోనే ఆఫీస్‌ నుండి అమెరికావెళ్లే అవకాశం వచ్చిందని పెళ్ళి రిజిస్ట్రేషన్‌ కూడాచేయిస్తాడు. అమెరికా వెళ్లేదుకు డబ్బులు కావాలంటూ తిరిగి డబ్బులకోసం వేధిస్తుంటాడని వారు తెలిపారు.  

బయటపడింది ఇలా ..  
నాలుగవ భార్యవద్ద అమెరికా వెళదామ ని డబ్బు తీసుకోవడం, నైట్‌ డ్యూటీ, డే డ్యూటీ అంటూ ఇంటికి సరిగ్గా రాకపోవడంతో  అనుమానం వచ్చి గట్టిగా నిలదీయండంతో నీకు రావల్సిన డబ్బులునీకు ఇచ్చేస్తానుఅని శివశంకర్‌ చెప్పాడు. దీంతో బాధిత మహిళ ఆర్‌.సీ పురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్టేషన్‌కు రా వాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఐద వ భార్యను తీసుకుని స్టేషన్‌కు వెళ్లగా ఇద్ద రు భాధిత మహిళలు మాట్లాడుకుని ఇత ని గుట్టుమొత్తం బయటపెట్టారు. ఐదవ భార్యకూడా గట్టిగా మందలించడంతో ఈ నెల 7వ తేదీన ఆరవ భార్యను తీసుకుని వెళ్లిపోయినట్లు భాధిత మహిళ తెలిపింది. 8వ తేదీన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేయించినట్లు ఆమె పేర్కొంది. గుంటూరులో ఇతని తల్లిదండ్రులు ఉన్నారని మొదటి భార్య కూడా అక్కడేఉందని  తెలిపారు.  

చదవండి: ఖైదీ నెంబర్‌ 2001.. నాగేశ్వర్‌రావు రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు

మరిన్ని వార్తలు