డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. కలుసుకుందామని చెప్పడంతో.. ముఖం చూసి షాక్‌

24 Oct, 2022 11:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు లాక్కున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బీహెచ్‌ఈఎల్‌లో పనిచేస్తున్న యువకుడు(25) ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి బ్లూడ్‌ అనే స్వలింగ సంపర్కుల యాప్‌లో అమీర్‌ అలియాస్‌ వంశీనాయుడు అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి ప్రొఫైల్‌ పిక్చర్‌ చూసిన బాధిత యువకుడు కలుసుకుందామని చెప్పడంతో ఈ నెల 21న రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12కు వచ్చాడు.

అయితే ప్రొఫైల్‌లో పెట్టిన ఫొటోకు.. తనను కలిసేందుకు వచ్చిన వ్యక్తికి పోలికలు లేకపోవడంతో పాటు వచ్చిన వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించిన బాధితుడు తనకు నచ్చలేదని  చెప్పి వెనక్కి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన అమీర్‌ అలియాస్‌ వంశీకృష్ణ కత్తి బయటికి తీసి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. తనవద్ద డబ్బు లేదని చెప్పినా వినిపించుకోకుండా ఫోన్‌ లాక్కుని గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రూ. 31 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. బాధితుడు శనివారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: Hyderabad: భర్తతో సినిమాకు వెళ్లి.. కనిపించకుండా పోయిన భార్య

మరిన్ని వార్తలు