ప్లాస్మా కావాలంటే ఈ నంబర్లకు కాల్‌.. తీరా చేస్తే..

28 Apr, 2021 08:42 IST|Sakshi

వాట్సాప్‌ గ్రూపుల్లో ట్రోల్‌ అవుతున్న ప్లాస్మా దాతల ఫేక్‌ నంబర్లు

‘వెరిఫైడ్‌’ అని చెబుతూ పోస్టింగ్‌ 

అత్యవసర సమయాల్లో ఆ నంబర్లకు ఫోన్లు చేస్తున్న బాధితులు 

నంబర్లన్నీ స్విచ్ఛాఫ్‌.. నో ఆన్సర్‌..  

హిమాయత్‌నగర్‌: కోవిడ్‌ సమయంలో ‘మనుషుల మాట సాయం’ అవతలి వ్యక్తి ప్రాణాన్ని నిలబెడుతుంది. కోవిడ్‌కు గురైన వ్యక్తులకు ప్రస్తుతం రెమిడిసివర్‌ ఇంజక్షన్, ఆక్సిజన్‌ ఎంత అవసరమో.. ప్లాస్మా కూడా అంతే అవసరం. ప్లాస్మా కావాలంటే ఈ నంబర్లకు ఫోన్‌లు చేయండి. వీరంతా హైదరాబాద్‌లో ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న నంబర్లన్నీ ఫేక్‌ అనే నిర్ధారణ బాధితుల నుంచి వెలువడుతుంది. ఆఖరి సమయంలో వారి సాయం కోసం ఫోన్‌ చేస్తుండగా స్విచ్ఛాఫ్‌ లేదా ఔట్‌ఆఫ్‌ కవరేజ్‌ అనేది వినిపిస్తుంది. 

వెరిఫైడ్‌ అంటూ వైరల్‌.. 
కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ప్రారంభమైన వారం రోజుల నుంచి ప్లాస్మా దాతల కోసం కోవిడ్‌ రోగుల తరుఫు బంధువులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దికాలంగా 50 మంది లిస్ట్‌ ఉన్న ప్లాస్మా దాతల ఫోన్‌ నంబర్లు ఒక 5, 6 వాట్సాప్‌ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్‌ అయ్యాయి. ఇవన్నీ తాము వెరిఫై చేసే పోస్ట్‌ చేస్తున్నామని, మీరు ఆపత్కాల సమయంలో సంప్రదించి ప్రాణాన్ని నిలబెట్టండంటూ ఓ సందేశాన్ని కూడా ఇస్తున్నారు. చాలా ఈ మెసేజ్‌లను ఫార్వర్డ్‌ కూడా చేస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా కోవిడ్‌ బారీన పడిన వారు ప్లాస్మా దాతల కోసం ఈ ఫోన్‌నంబర్లకు ట్రై చేస్తుంటే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. ఆయా నంబర్లకు ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్‌ లేదంటే ఔట్‌ ఆఫ్‌ కవరేజ్‌ అని వస్తుంది. ఇలా చివరి నిమిషంలో కోవిడ్‌ తరఫున నాన్న, కొడుకు, తల్లి, అక్క, చెల్లి పడుతున్న వేధన వర్ణణాతీతం. దీనిపై ఎవరూ కూడా సరైన అవగాహన లేకుండా సర్క్యులేట్‌ చేయడం కారణంగా విపత్కర పరిస్థితుల్లో కోవిడ్‌ బాధితులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.  

( చదవండి: ఆక్సిజన్‌ వచ్చేసింది )

మరిన్ని వార్తలు