హైదరాబాద్‌ వరదలు: వైరల్‌‌ వీడియోలు

18 Oct, 2020 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూడు రోజుల క్రితం రెండు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రధాన రహదారులు, గల్లీలు, నాలాలు వరద నీటితో నిండి నదులను తలపించాయి. దాదాపు 50 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. నగర జనం వరద నుంచి కొద్దిగా తేరుకుని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో శనివారం మళ్లీ వర్షం దంచి కొట్టింది. దీంతో పరిస్థితి మొదటికొచ్చింది. చాలా వరకు ఏరియాలు నీటిలో మునిగిపోయాయి. మూసీ ఉగ్రరూపం దాల్చింది. చెరువులు పూర్తిగా నుండి పోయి ఉన్నాయి. ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ( మళ్లీ ఉగ్రరూపం దాల్చిన మూసీ నది )

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వరదలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఇంట్లోకి పెద్ద పెద్ద చేపలు వచ్చి, ఆ ఇళ్లు అక్వేరియాన్ని తలపించటం.. కొందరు యువకులు రోడ్డు మీద చేపలు పట్టడం.. నీళ్లతో నిండిన నడి రోడ్డుపై ఓ వ్యక్తి ఈత కొట్టడం.. వంటి వీడియోలు నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. వీటిలో కొన్ని చాలా పాత వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్‌ కావటం గమనార్హం.

మరిన్ని వార్తలు