Hyderabad: మృతదేహాల తరలింపునకు ఉచిత అంబులెన్స్‌లు

25 May, 2021 10:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సంప్రదించాల్సిన అధికారులు.. వారి ఫోన్‌ నెంబర్లు ఇలా.

అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం

వెల్లడించిన మునిసిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ  

సాక్షి, హైదరాబాద్‌: మరణించిన వారిని ఇల్లు/ఆస్పత్రి నుంచి శ్మశాన వాటికకు ఉచితంగా తరలించేందుకు అంతిమయాత్ర రథాలను (అంబులెన్స్‌) ప్రభుత్వం గ్రేటర్‌లో అందుబాటులోకి తెచ్చింది. వీటిని అవసరమైన వారు సంబంధిత ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు అంబులెన్స్‌ల కోసం సంప్రదించాల్సిన అధికారుల ఫోన్‌నెంబర్లను మునిసిపల్‌ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ జోన్ల వారీగా వెల్లడించారు. మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సుల వారు భారీఎత్తున వసూళ్లకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులతో మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ప్రభుత్వం ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 

జోన్ల వారీగా అంబులెన్సుల కోసం సంప్రదించాల్సిన అధికారులు.. వారి ఫోన్‌ నెంబర్లు ఇలా.. 

1. ఎల్‌బీనగర్‌ జోన్‌: కుమార్,
సూపరింటెండెంట్‌(9100091941) 
ఎన్‌ వెంకటేశ్, డీటీసీఓ(9701365515) 

2. చార్మినార్‌ జోన్‌: డి.డి నాయక్,
జాయింట్‌ కమిషనర్‌(9440585704)
ఎస్‌.బాల్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(9849907742). 

3. ఖైరతాబాద్‌ జోన్‌: రాకేశ్,ఏఈ(7995009080) 

4. కూకట్‌పల్లి జోన్‌: చంద్రశేఖర్‌రెడ్డి, 
ఏఎంఓహెచ్‌(7993360308) 
శ్రీరాములు, డీసీటీఓ(9515050849) 

5. శేరిలింగంపల్లి జోన్‌:
జేసీ మల్లారెడ్డి(6309529286)
ఎం.రమేశ్‌కుమార్‌(9989930253)
డీవీడీ కంట్రోల్‌రూమ్‌(9154795942) 

6. సికింద్రాబాద్‌ జోన్‌: డా.రవీందర్‌గౌడ్,
ఏఎంఓహెచ్‌(7993360302) 
శంకర్, డీటీసీఓ(9100091948)  

చదవండి: కిలాడీ భార్య నిర్వాకం.. ప్రియుడి కోసం ఏకంగా..

మరిన్ని వార్తలు