ఉన్నత చదువులకు చేయూత అందించండి

7 Jul, 2021 10:58 IST|Sakshi

దాతల కోసం చదువుల తల్లి ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన చదువుల తల్లి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక కష్టాలు పడుతోంది. కుటుంబ ఆర్థిక స్థితికి మించి కోర్సు ఫీజు ఉండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.

ప్రైవేటు ఉద్యోగి కురవ పులికొండ రంగస్వామికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె వైష్ణవి చిన్నప్పటి నుంచి చదువుల్లో రాణిస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులున్నా బీటెక్‌ వరకు చదివించాడు. లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హెర్ట్‌పోర్డ్‌షైర్‌లో ఎంఎస్‌(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ విత్‌ రోబోటిక్‌) కోర్సుపై ఆసక్తితో దరఖాస్తు చేసుకోగా అనుమతి లభించింది. అప్పు చేసి ముందస్తుగా సీటు కోసం రూ.5 లక్షలు చెల్లించారు. కోర్సు మొత్తం ఫీజు రూ.16.50 లక్షలు కాగా, అడ్మిషన్‌ తీసుకున్న ఎనిమిది నెలల్లో పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యా లక్ష్మి పథకం కింద బ్యాంక్‌లో రుణం కోసం ప్రయత్నించగా రూ.7 లక్షల వరకు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు.

ఒక వేళ బ్యాంక్‌ రుణం మంజూరు చేసినా ఫీజు కోసం రూ.4.50 లక్షలు,  కోర్సు పూర్తయ్యే వరకు మరో రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతోంది. మొత్తం రూ.16.50 లక్షలు అవసరం. ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఉన్నత చదువుల కోసం మనస్సున్న దాతలు ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అకౌంట్‌ నంబర్‌ 0649118000761, కెనరా బ్యాంక్, వెంగళ్‌రావునగర్‌ బ్రాంచ్, ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్‌ సీఎన్‌ఆర్‌బీ.0006108, హైదరాబాద్‌. ఫోన్‌: 97051 44495 గూగుల్‌ పే, ఫోన్‌ పే చేసి ఆర్థిక సాయం అందించవచ్చు.  

మరిన్ని వార్తలు