Heavy Rains in Hyderabad: కిలోమీటర్లమేర ట్రాఫిక్‌ జామ్‌

22 Jul, 2022 20:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలో కిలోమీటర్లమేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఇక వాకర్స్‌ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతవరణశాఖ వెల్లడించింది.

కూకట్‌పల్లి వై జంక్షన్‌ చెరువును తలపిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మెట్రో పక్కన పార్క్‌ చేసిన బైక్‌లు నీటిలో మునిగాయి. ఫతేనగర్‌  స్టేషన్‌ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. 5 అడుగులకు పైగా వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. ఫతేనగర్‌ మీదుగా వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్‌ సిబ్బంది సూచించారు. అమీర్‌పేట్‌ నుంచి కూకట్‌పల్లి వెళ్లే వాహనాలు నిలిపివేశారు.
చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్‌ అలర్ట్‌

మెట్రో ఇబ్బందులు
భారీ వర్ష ప్రభావం మెట్రో స్టేషన్లను కూడా తాకింది. మెట్రో స్టేషన్లలో సర్వర్‌ ప్రాబ్లమ్‌ తలెత్తింది. టికెట్లు ఇష్యూ కాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో అరగంట నుంచి మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వార్తలు