Hyderabad Gang Rape Case: బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి

3 Jun, 2022 21:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. కచ్చితంగా నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసులకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. 

కేటీఆర్‌ ట్వీట్‌
జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచార ఘటన వార్తలు చూసి షాక్‌ గురయ్యానన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అన్నారు. నిస్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. 

ఇద్దరు అరెస్ట్‌
కాగా జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌కు వెళ్లిన 17 ఏళ్ల బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు చేశారు. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ కుమారుడు

మరిన్ని వార్తలు