హోప్‌ ఆధ్వర్యంలో ‘అచీవర్స్‌’ అవార్డులు 

9 Mar, 2022 02:37 IST|Sakshi

మాదాపూర్‌: మాదాపూర్‌లోని శిల్పారామంలో హోప్‌ అడ్వర్‌టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సౌత్‌ ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవేళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి, సీతారెడ్డిలు హజరయ్యారు.

కోవిడ్‌ సమయంలో అత్యుత్తమ సేవ చేసినందుకు డాక్టర్‌ మనీష్‌ రాందాస్, సంస్కృతంలో డాక్టరేట్‌ చేసినందుకు డాక్టర్‌ మృదుల అశ్విన్, మొదటి సారే సివిల్‌ సర్వీసెస్‌కు సెలెక్ట్‌ అయినందుకు కుమారి మేఘనలకు అఛీవర్స్‌ అవార్డులను అందజేశారు.

మరిన్ని వార్తలు