నాకు బతకాలని లేదంటూ భార్య మెసేజ్‌.. అదృశ్యం

4 Jun, 2021 10:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఖైరతాబాద్‌( హైదరాబాద్‌): ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నానని చెప్పిన మహిళ తనకు బతకాలని లేదంటూ ఆమె భర్తకు మెసేజ్‌ చేసి అదృశ్యమైన సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లిలో నివాసముండే రాజ్‌కుమార్‌ ఓ చర్చ్‌ పాస్టర్‌. గురువారం ఇతడి భార్య కిషోరి(66) ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాని చెప్పి వెళ్లింది.

మధ్యాహ్నం తరువాత నాకు బతకాలని లేదంటూ ఫోన్‌ ద్వారా మెసేజ్‌ చేసింది. మెసేజ్‌ చేసిన కొంత సమయానికి సుమారు 3 గంటల ప్రాంతంలో ఆమె భర్త మెసేజ్‌ చూసుకొని ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చిందని, వెంటనే ఆటోలో వెళ్లిన డ్రైవర్‌ను విచారించగా సచివాలయం గేట్‌ నెం.1 వద్ద దింపినట్లు తెలుపడంతో భర్త గురువారం రాత్రి సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వలేదని ఒకరు.. ఫోన్‌ నాకే కావాలంటు మరొకరు  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు