దసరా సీజన్‌.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు

25 Sep, 2022 07:59 IST|Sakshi

హైదరాబాద్‌: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్‌–తిరుపతి (07469/07470) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 25న సాయంత్రం 5.50 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో 26న రాత్రి 8.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌–యశ్వంత్‌పూర్‌ (07233/07234) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 25, 27 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి మలిరోజు ఉదయం 10.50కి యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 26, 28 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకి యశ్వంత్‌పూర్‌ నుంచి బయల్దేరి తర్వాత రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లకు భారీ షాక్‌!

మరిన్ని వార్తలు