ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థి కిడ్నాప్‌.. విషయం తెలిసి తల్లిదండ్రుల షాక్‌

11 Feb, 2022 19:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: ఇంటర్మీడియేట్‌ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన  17 ఏళ్ల బాలిక ఇంటర్‌ మీడియేట్‌ చదువుతుంది. ఈ నెల 9వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు తెలిసిన వారు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడా కనిపించ లేదు.

సాయంత్రం వేళ ఆ యువతి తన ఫోన్‌ నుంచి తల్లికి ఫోన్‌ చేసింది. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని అతన్ని పెళ్లి చేసుకునేందుకు వెళుతున్నానని చెప్పి పెట్టేసి అటు తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పాలిటెక్నిక్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌.. ఆ రెండు పరీక్షలు రద్దు 

మరిన్ని వార్తలు