‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’

26 Sep, 2020 15:28 IST|Sakshi

హేమంత్‌ తమ్ముడు సుమంత్‌ ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కారణంతో దారుణ హత్యకు గురైన హేమంత్‌ తమ్ముడు సుమంత్‌ సాక్షి టీవీతో శనివారం మాట్లాడారు. తన అన్న హత్య కేసులో ప్రమేయమున్నా ఒక్కరినీ వదలొద్దని అతను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఇలాంటి హత్యలు జరగొద్దని కోరుకున్నారు. హత్యోదంతంపై సుమంత్‌ మాట్లాడుతూ..  మా అన్న హేమంత్‌ను కొట్టుకుంటూ సంగారెడ్డి తీసుకెళ్లి చంపారట. చివరి సారిగా ఆకలిగా ఉందని చెప్పినా వాళ్లు కనికరించలేదంట.
(చదవండి: మరో ‘పరువు’ హత్య)

నీకెందుకురా అన్నం అంటూ కొట్టారంట. హత్య వెనకాల అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి, తల్లి అర్చన ప్రధాన పాత్ర పోషించినట్టు తెలసుస్తోంది. నా అన్న చంపిన వారిని వదలొద్దు. ఇలాంటి హత్యలు మళ్లీ జరగొద్దు. యూకేలో హోటల్ బిజినెస్ ప్లాన్ చేశాను. కుటుంబం మొత్తం అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నాం. ఈ లోపే అన్నయ్యకు ఇంత దారుణం జరగడం కష్టంగా ఉంది. అన్నయ్య సినిమాల్లో ప్రయత్నించాడు. అమ్మ ఇద్దరినీ అందంగా ఉండాలని కోరుకునేది. కానీ చివరిసారిగా అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’అని సుమంత్‌ కన్నీరుమన్నీరయ్యాడు.
(చదవండి: వాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయండి: అవంతి)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు