నీలోఫర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

1 Nov, 2021 16:09 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌: నీలోఫర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదు.. వార్డుల్లో పనిచేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల వార్డుబాయ్‌  100 రూపాయల కోసం ఆక్సిజన్‌ను మార్చడం వలన ఒక పసివాడి నిండు ప్రాణం పోయిన విషయం తెలిసిందే.

ఈ ఘటనకు నిరసనగా బాధితుల బంధువులు మూకుమ్మడిగా ఆస్పత్రి లోపలికి వచ్చారు. దీంతో.. ఇతర సిబ్బంది తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. బాధిత బంధువులు.. ఎక్కడ దాడిచేస్తారోనని భయపడిపోయారు. తక్షణం.. తమకు సరైన భద్రత కల్పించాలని ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేపట్టారు.  

చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌ కేసు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

మరిన్ని వార్తలు