సైబర్‌ సిటీలో సాఫీ జర్నీ.. నయా సాల్‌ కానుకగా  కొత్తగూడ ఫ్లైఓవర్‌

20 Dec, 2022 12:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌  సమస్య పరిష్కారానికి చేపట్టిన కొత్తగూడ ఫ్లైఓవర్‌  త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త సంవత్సర కానుకగా జన వరి మొదటి వారంలో  మంత్రి కె.తారక రామా రావు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. దాదాపు రూ.263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈప్రాజెక్టు వినియోగంలోకి వచ్చాక పరిసర కాలనీల్లోని వారితోపాటు ఆ మార్గాల్లో ప్రయాణించేవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తక్కువ దూరంలో  ఉన్న  బొటానికల్‌ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ చిక్కుల  నుంచి సాఫీగా వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ జంక్షన్ల పరిసరాల్లోనే అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలుండటం తెలిసిందే. సదరు కంపెనీల్లోని ఉద్యోగుల రాకపోకలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు  తొలగుతాయి.  

మియాపూర్‌ దాకా మంచి కనెక్టివిటీ.. 
ఈ ఫ్లై ఓవర్‌ వల్ల  గచ్చిబౌలి నుంచి మియాపూర్‌ వరకు మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. మియాపూర్, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ పరిసర  ప్రాంతాల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.  బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్, కొత్తగూడ జంక్షన్‌లలో 100 శాతం ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంతో పాటు కొండాపూర్‌ జంక్షన్‌ లో 65 శాతం ట్రాఫిక్‌ సమస్య తీరుతుందని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 3 కిలో మీటర్ల పొడవుతో చేపట్టిన ఫ్లై ఓవర్‌తో పాటు  470 మీటర్ల పొడవు,  11 మీటర్ల వెడల్పుతో అండర్‌ పాస్‌ను కూడా చేపట్టి పూర్తి చేశారు. 

ఫ్లై ఓవర్‌ ఇలా.. 
మెయిన్‌ ఫ్లై ఓవర్‌  ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌ నుంచి బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌ వరకు.. బొటా నికల్‌ గార్డెన్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌వరకు..అక్కడి నుంచి  కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ వరకు. పొడవు 2.21 కి.మీ. ∙మజీద్‌బండ రోడ్‌వైపు నుంచి వచ్చేవారి కోసం బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌ వరకు 2 లేన్లతో అప్‌ర్యాంప్‌ 401మీటర్లు.  ∙కొత్తగూడ జంక్షన్‌ నుంచి హైటెక్‌సిటీ వైపు 3 లేన్లతో డౌన్‌ ర్యాంప్‌ 383 మీటర్లు. ∙అన్నీ వెరసి దాదాపు 3 కి.మీ.ల పొడవు.  హఫీజ్‌పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు కొత్తగూడ జంక్షన్‌వద్ద 3లేన్ల అండర్‌పాస్‌.దీనిపొడవు 470 మీటర్లు.   

మరిన్ని వార్తలు