పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది?

3 Jun, 2022 18:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పబ్‌, బేకరీతోపాటు పలు ప్రాంతాల్లో సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.  బాలికపై అత్యాచారం జరిగింది వాస్తవమేనని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. నలుగురు నిందితులు మైనర్లేనని వారిపై పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు గోవాకు పరారయ్యారని సమాచారం అందిందని, గోవాలో రెండు బృందాలుగా పోలీసులు జల్లెడ పడుతున్నారని పేర్కొన్నారు.

బాలికను పబ్‌కు తీసుకెళ్లిన హదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంజ్‌ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాదీని బురిడి కొట్టించి బాలురు బాలికను తీసుకెళ్లారని, రెండు గంటలపాటు బాలికపై మైనర్‌ బాలురు అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసి మరో కారులో పబ్‌ వద్ద బాలికను వదిలివెళ్లారన్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్న విచారణలో తేలుతుందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సంబంధిత వార్త: ఆమ్నేషియా పబ్‌ కేసు.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌ వద్ద ఉద్రిక్తత 

లిక్కర్‌ పార్టీ జరగలేదు.
అమ్నేషియా పబ్‌లో లిక్కర్‌ పార్టీ జరగలేదని, పబ్‌లో న్యూసెన్స్‌ జరగలేదని పోలీసులు స్పష్టం​ చేశారు. పబ్ నుంచి బాలిక స్నేహితులతో బయట వెళ్ళిన తరువాత బెంజ్ కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తండ్రికి చెప్పడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

బాలిక స్టేట్‌మెంట్‌
ఆమ్నేషియా పబ్ వ్యవహారంలో బాధిత బాలిక.. తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ‘మే 28న సా.5 గంటలకి గుర్తుతెలియని యువకులు నన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆమ్నేషియా పబ్‌లో మేం పార్టీ చేసుకున్నాం, పార్టీలో కొందరు యువకులు నన్ను బెంజ్ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. బెంజ్‌ కారులో నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 7 గంటలకు పబ్ దగ్గర తనను వదిలిపెట్టారు. నా మెడ వద్ద గాయాలైన విషయాన్ని మా నాన్న గమనించారు. నాపై జరిగిన అఘాయిత్యం గురించి ఆయనకు  చెప్పాను. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు’ అని పేర్కొంది.

అసలేం జరిగింది?
కాగా గత నెల 28న బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లో నివసించే బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్‌ కారులో (టీఎస్‌ 09 ఎఫ్‌ఎల్‌ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. సాయంత్రం 5  గంటల వరకు అక్కడే పార్టీ చేసుకున్నారు. అనంతరం పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది. బాలికను బలవంతంగా బెంజ్‌ కారులో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి ఆహారం కొనుగోలు చేశారు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కార్లోనే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత 7.30 నిమిషాల సమయంలో పబ్‌ వద్ద వదిలేసి వెళ్లారు. అనంతరం బాలిక ఫోన్‌ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’

నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు
ఇదిలా ఉండగా అత్యాచార నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. హోమంత్రి మనవడు, ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్‌ బోర్డు చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పాత్ర ఉన్నట్లు పలు అరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకైతే దీనిపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు