చేతబడి చేశాడనే అనుమానంతో..

25 Aug, 2021 10:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ధారూరు(వికారాబాద్‌): చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై కొందరు దాడి చేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని గురుదోట్ల గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(35) కొంతకాలంగా బాణామతి, చేతబడి చేస్తున్నాడని స్థానికులు అనుమానించసాగారు. ఈక్రమంలో ఓ ఇంటి మేడతోపాటు మరో వ్యవసాయ పొలంలో నిమ్మకాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, ఇతర పూజాసామగ్రి పడటంతో వారి అనుమానం మరింత బలపడింది.

ఈమేరకు సోమవారం ఉదయం కొందరు వ్యక్తులు కలిసి సదరు వ్యక్తిని పట్టుకుని నిలదీశారు. తనకు ఎలాంటి పాపం తెలియదని ఆయన వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహానికి గురై చితకబాదారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు మంగళవారం గొడవపై ఆరా తీశారు. పోలీసులు కేసులు నమోదు చేస్తారనే భయంతో ఇరువర్గాలు రాజీపడ్డారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన వారు ఓ గుడి వద్ద కూర్చుని చర్చించుకొని రాజీపై పోలీసులకు సర్దిచెప్పుకొన్నారని సమాచారం.  

చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా 

chicken: భర్త చికెన్‌ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య

మరిన్ని వార్తలు