దేశంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!

6 Dec, 2021 09:11 IST|Sakshi

India's First Dwarf Driving License: ప్రపంచంలో అందరికి ఏవేవో లోపాలు ఉంటాయి. కొంతమంది వాటిని అధిగమించి తమలో ఉన్న నైపుణ్యాలకు పదునుపెట్టి స్ఫూర్తిదాయకంగా నిలవడానికి ప్రయత్నిస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అలానే చేసి అందరికి స్ఫూర్తిగా నిలాచాడు.

(చదవండిఅందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!)

అసలు విషయంలోకెళ్లితే...కరీంనగర్‌ జిల్లాకి చెందిన గట్టిపల్లి శివపాల్ సుమారు మూడు అడుగుల ఎత్తులో ఉండే 42 ఏళ్ల మరుగుజ్జు వ్యక్తి. అంతేకాదు మరుగుజ్జువాళ్లలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అయితే అతన్ని ప్రజలు  తనని ఎత్తు కారణంగా హేళన చేస్తుండేవారని చెబుతున్నాడు. ఈ క్రమంలో అతను తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, పైగా తనలాంటి వాళ్లకి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రజలు కూడా సుముఖంగా లేరని వాపోయాడు.

అయితే తన స్నేహితురాలి సాయంతో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ప్రస్తుతం తాను అక్కడే 20 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు అతను ఎక్కడికైన వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసినప్పుడల్లా వారు తన రైడ్‌ని రద్దుచేసేవారని, పైగా తన భార్యతో కలిసి బయటకి వెళ్లినప్పుడల్లా రకరకాలుగా కామెంట్లు చేసేవారని శివపాల్‌ అన్నాడు. దీంతో అప్పుడే శివపాల్‌ తానే స్వయంగా కారు నడపాలనే నిర్ణయించుకున్నాడు. పైగా అందుకోసం ఇంటర్‌నెట్‌లో విపరీతంగా సర్చ్‌  చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే శివపాల్‌కి యూఎస్‌లో ఒక వ్యక్తి అప్‌లోడ్‌ చేనిన వీడియో ఒకటి అతన్ని ఆకర్షించింది. అంతేకాదు ఆ వీడియోలో కారుని తన ఎత్తుకు తగిన విధంగా సెటప్‌ చేస్తే సులభంగా డ్రైవ్‌ చేయవచ్చునని వివరించి ఉంది. దీంతో అతను అనుకున్నదే తడువుగా తన స్నేహితుడి సాయంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు.

అయితే  రవాణా శాఖకు ఎత్తుపై కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉన్నందున లైసెన్స్ పొందడం మరొక అతి పెద్ద సవాలుగా మారింది. ఈ మేరకు శివపాల్‌ అధికారులకు విజ్ఞప్తి చేసి సరైన డ్రైవింగ్‌ టెస్ట్‌ చేయించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాడు. అంతేకాదు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తిగా నిలవడమే కాక  లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి నామినేట్‌ అయ్యాడు. దీంతో చాలామంది మరుగుజ్జు వ్యక్తులు శివపాల్‌ని  డ్రైవింగ్‌ శిక్షణ కోసం సంప్రదించడం విశేషం. అంతేకాదు శివపాల్‌ వచ్చే ఏడాది శారీరక వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

(చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్‌ వ్యాక్సిన్‌!!)

మరిన్ని వార్తలు