వీడియో: ‘నేను పాలు తాగిన సార్‌ అంతే’.. హైదరాబాద్‌ పోలీసుల రియాక్షన్‌ చూసేయండి

15 Jul, 2023 19:56 IST|Sakshi

Drunken Drive Funny Viral: మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయలో శుక్రవారం రాత్రి పెద్ద జోక్‌ అయ్యింది. డ్రంకెన్‌ డ్రైవ్ తనిఖీలు జరుగుతుండగా.. కారులో ఓ వ్యక్తి వచ్చాడు. అందరి మాదిరిగానే అతనికి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహించగా.. 94 శాతం రీడింగ్ పాయింట్లు నమోదయ్యాయి.

ఏం తీసుకున్నావని పోలీసులు ప్రశ్నించగా.. పాలు తాగానని చెప్పడంతో అక్కడే ఉన్న ఉన్నతాధికారి ఒక్కసారిగా ఘోల్లుమని నవ్వాడు. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్‌గ్రూపుల్లో వైరల్‌ అవుతోంది.

సదరు వ్యక్తిని అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే ఐటీ ఉద్యోగిగా.. పోలీసులు అతని ద్వారానే చెప్పించారు. ఆ తర్వాత తమ స్టయిల్‌లో గట్టిగా నిలదీసేసరికి.. మద్యం సేవించినట్లు అంగీకరించాడు. ఆపై అతనిపై కేసు ఫైల్‌ చేశారు. 

మరిన్ని వార్తలు