హైదరాబాద్‌ మెట్రో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇలా.. 

1 Nov, 2020 20:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో స్మార్ట్‌ కార్డున్న ప్రయాణికులకు క్యాష్‌ బ్యాక్‌ పథకంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ ఎండీ స్పష్టతనిచ్చారు. స్మార్ట్‌కార్డు కొనుగోలు లేదా రీచార్జీ చేసిన నాటినుంచి 90 రోజులపాటు క్యాష్‌ బ్యాక్‌ స్కీం వర్తిస్తుంది. స్మార్ట్‌ కార్డు రీచార్జీని మెట్రో స్టేషన్లలో లేదా పేటీఎం, టీ- సవారీ యాప్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్టేషన్లలో రీచార్జీ చేసిన వెంటనే క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుంది. యాప్‌ ద్వారా చేసుకుంటే రెండు గంటల సమయం పడుతుందని తెలిపారు.

రూ.100 నుంచి రూ.300 మొత్తాన్ని స్మార్ట్‌ కార్డులో రీచార్జీ  చేసుకుంటే క్యాష్‌ బ్యాక్‌ వర్తించదు. కానీ ప్రయాణ చార్జీలో 10 శాతం రాయితీ లభిస్తుంది. రూ.400 నుంచి రూ.2000 వరకు స్మార్ట్‌కార్డులో రీచార్జీ చేసుకునే వారికి క్యాష్‌ బ్యాక్‌తో పాటు ప్రయాణ చార్జీల్లోనూ 10 శాతం రాయితీ లభిస్తుందన్నమాట. అంటే కనీసం రూ.400 నుంచి రూ.2000 వరకు రీచార్జీ చేసుకునేవారికే అధిక ప్రయోజనం చేకూరనుంది.

స్మార్ట్‌ కార్డులో ఎంత రీచార్జీ చేసుకుంటే.. ఎంత క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందంటే..

రీచార్జీ చేసుకునే మొత్తం లభించే క్యాష్ ‌బ్యాక్‌ కార్డులో జమయ్యే మొత్తం (క్యాష్‌బ్యాక్‌తో కలిపి)
400 100 500
500   150 650
1000 300 1300
1500 600 2100
1750 700 2450
2000 800  2800


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు