హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ వద్ద కూల్చివేత.. క్షణాల్లో నేలమట్టమైన భవనాలు

23 Sep, 2023 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఇవాళ ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మాదాపూర్ మైండ్ స్పేస్ ఐటీ పార్కులోని రెండు పక్కపక్క భవనాలను క్షణాల్లో నేలమట్టం చేసేశారు.  పేలుడు పదార్థాల అమర్చి.. అధునాతన టెక్నాలజీతో ఈ కూల్చివేత చేపట్టారు. 

మాదాపూర్‌ మైండ్‌స్పేస్‌లోని రెండు భవనాలను క్షణాల్లో నేలమట్టం చేశారు. డిజైనింగ్‌లో లోపంతో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఐసి నుండి అనుమతి లభించింది.  భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు  బిల్డింగ్ ఓనర్స్ తెలిపారు.

కూల్చివేసిన స్థానంలో భారీ భవనాలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు