హైటెక్‌ సిటీ: వాహనదారులకు తప్పనున్న ట్రాఫిక్‌ కష్టాలు

5 Apr, 2021 11:53 IST|Sakshi

రూ.66.59 కోట్లతో హైటెక్‌ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జ్‌ నిర్మాణం

హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ మార్గంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

సాక్షి, హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో పూర్తి చేసిన హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో ఇప్పటికే అధిక ట్రాఫిక్‌ ఉన్న హైటెక్‌ సిటీ, ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ మార్గంలో కష్టాలు తీరనున్నాయి.

ఇక జేఎన్‌టీయుహెచ్‌ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలోని ఈ రైల్వే బ్రిడ్జి కింద గతంలో చిన్నపాటి వర్షం పడితే ఇక్కడి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్‌ సమస్య తలెత్తేది. ప్రతిరోజు దాదాపుగా 40 వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండేది. అదే విధంగా చిన్నపాటి వర్షం కురిసినా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయటానికి సమీపంలోనే పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట సర్కిల్‌లో నాటిన హరితహారం మొక్కలకు అందించనున్నారు. 

చదవండి: సర్పంచ్‌ పాడె మోసిన మంత్రి జగదీశ్‌‌ రెడ్డి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు