‘ఫెమ్‌ టెక్‌’ గమ్యస్థానం.. హైదరాబాద్‌

26 Apr, 2022 01:18 IST|Sakshi

2030 నాటికి వంద బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా ఫార్మా,లైఫ్‌సైన్సెస్‌ 

‘ఫెర్రింగ్‌ ఫార్మా’ యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రస్తుతం 50 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా ఉన్న ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి వంద బిలియన్‌ డాలర్లకు చేర్చడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో జీనోమ్‌ వ్యాలీ.. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో పవర్‌హౌస్‌గా మారుతోందన్నారు. దీంతో ప్రపంచంలోని ప్రముఖ పరిశోధన, అభివృద్ధి సంస్థలు హైదరాబాద్‌కు పెట్టు బడులతో వస్తున్నాయని చెప్పారు.

స్విట్జ ర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే ఫెర్రింగ్‌ ఫార్మా హైదరాబాద్‌ టీఎస్‌ఐఐసీ బయోటెక్‌ పార్క్‌ లో ఏర్పాటుచేసిన కొత్త సమీకృత పరిశోధన, అభివృద్ధి, తయారీ యూనిట్‌ను కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ఇటీవలి తన అమెరికా పర్యటనలో వివిధ రంగాల్లో రూ.7,500 కోట్ల పెట్టుబడులు సాధించగా, అందులో సగం లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందినవే ఉన్నాయన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ రంగంలో పరిశోధన, తయారీ పరిశ్రమలకు (ఫెమ్‌ టెక్‌) హైదరాబాద్‌ అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోందన్నారు.

పుణేకు చెందిన భారత్‌ సీరమ్‌ వాక్సిన్‌ కంపెనీ త్వర లో రూ.200 కోట్ల పెట్టుబడితో ఇంజెక్టబుల్, వాక్సిన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఈ సంస్థ మహిళల ఆరోగ్య రక్షణ ఉత్పత్తులతో పాటు రేబిస్‌ వ్యాక్సిన్‌ తదితరాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. 30 మిలియన్‌ యూరో(సుమారు రూ. 245కోట్లు)ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫెర్రింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌ గర్భధారణ మొదలు ప్రసవం వరకు అవసరమైన ఔష ధాలు, చికిత్స విధానాలను అభివృద్ధి చేస్తుం దని చెప్పారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఫార్మా, హెల్త్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్, ఫెర్రింగ్‌ ఫార్మా ఉపాధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోసెట్టె, ఎండీ అనింద్య ఘోష్‌ పాల్గొన్నారు. 

ఆవిష్కరణలో ముందంజ.. 
ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ దూసుకుపోతోందని.. డిజైన్‌ థింకింగ్, ఆవిష్కరణలు, పరిజ్ఞానంలో కొత్త తీరాలను తాకుతోందని కేటీఆర్‌ అన్నారు. అడ్మినిస్ట్రేటవ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంతో తెలంగాణ ‘వాష్‌ ఇన్నోవేషన్‌ హబ్‌’(డబ్ల్యూఐహెచ్‌)ను ఏర్పాటు చేసిందన్నారు. వాష్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ లోగోను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. వాష్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ నిర్వహించే  ఐNఓఃగిఅ ఏ 3.0 వార్షిక ఉత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో జరిగే ఈ ఉత్సవంలో ఔత్సాహిక ఆవి ష్కకర్తలు పాల్గొనాలని కేటీఆర్‌ పిలుపు నిచ్చారు. స్టార్టప్‌లు, రాష్ట్ర ప్రభుత్వం,  విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వా మ్యంతో వాష్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ పని చేస్తుం దన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్దేశిం చుకున్న ప్రమాణాలను చేరుకునేందుకు ప్రభుత్వం వాటర్, శానిటేషన్, హైజీన్‌ (వాష్‌)కు ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు