ముంబైలో ప్రత్యక్షమైన మేడ్చల్‌ బీటెక్‌ విద్యార్థిని.. ఇన్‌స్టా అధారంగా... 

11 Jul, 2022 10:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కండ్లకోయ సీఎంఆర్‌ కళాశాలలో బీటెక్‌  చదవుతున్న విద్యార్థి అదృశ్యం ఘటన సుఖాంతంగా ముగిసింది. మేడ్చల్‌లో నివసమున్న సకిరెడ్డి వర్షిణి కండ్లకోయలోని సీఎంఆర్‌ టెక్నికల్‌ క్యాంపస్‌లో  బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 7న కళాశాలకు తమ బంధువు వంశీమోహన్‌రెడ్డి వెంట ద్విచక్రవాహనంపై వెళ్లింది. అయితే వర్షిణి ఇంట్లోనే ఐడి కార్డు, ఫోన్‌ మరిచిపోవడంతో వాటిని తీసుకోవడానికి ఉదయం  10 గంటల ప్రాంతంలో ఇంటికి రావడానికి కళాశాల బయటకు వచ్చింది. ఆ తరువాత ఆమె ఆచూకీ లభించలేదు.

ఆమె కళాశాల నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు  కండ్లకోయలో రోడ్డుపై ఉన్న బేకరి సీసీ కెమెరాలలో రికార్డ్‌ అయ్యాయి. కుమార్తె కోసం ఆమె తండ్రి శివాజీ వెతికినా లభ్యం కాకపోవడంతో మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం వర్షిణి ముంబయ్‌లోని కళ్యాణ దుర్గ రైల్వెస్టేషన్లో ఉందని మేడ్చల్‌ పోలీసులకు సమాచారం వచ్చింది. ఆమెను మేడ్చల్‌ కు రప్పించడానికి ప్రత్యేక బృందం ముంబయ్‌కు వెళ్ళింది. 

ఇన్‌స్టా గ్రామ్‌ అధారంగా... 
వర్షిణి ఇన్‌స్ట్రాగాం ఆధారంగా  ఆమె ఆచూకీని పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. వర్షిణి వద్ద సెల్‌ ఫోన్‌ లేకపోయినప్పటికీ ముంబయ్‌లో తన ఇన్‌స్ట్రాగాంను  ఓపెన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించి అక్కడి పోలీసుల సహయంతో అమెను గుర్తించారని సమాచారం. 
చదవండి: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

మరిన్ని వార్తలు