Telugu Academy: తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌

29 Sep, 2021 12:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. కార్వన్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు 43 కోట్లు కాజేశారు. వివారాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యలపాలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు  తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్లలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధం అయ్యింది.

భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ ఖాఖల్లో రూ. 43 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని తేలింది. వీటిని గడువు తీరకముందే తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. అయితే 43 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసేందకు ప్రయత్నించగా ఆసలు బ్యాంక్‌లో డబ్బులు లేవని తేలింది.  సెప్టెంబరు 22న డబ్బులు కోసం తెలుగు అకాడమీ అధికారులు బ్యాంక్‌కు వెళ్లగా.. తర్వలో ఇస్తామని అధికారులు చెప్పారు. మళ్ళీ అడగ్గా ఆసలు నిధులు లేవని బ్యాంక్ మేనేజర్ మస్తాన్ అలీ పేర్కొన్నారు. దీంతో అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం లావాదేవిలో బ్యాంక్ మేనేజర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 43 కోట్లలో 23 కోట్లు వేరే బ్యాంక్‌కు బదిలీ అయినట్టు తెలుస్తోంది.
చదవండి: ఆ వయసులోపు వారిలో పెరుగుతున్న గుండెపోటు..

మరిన్ని వార్తలు