హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి!

28 Apr, 2021 18:19 IST|Sakshi

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌– నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌జీఆర్‌ఐ).. టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–21, టెక్నికల్‌ ఆఫీసర్‌–06, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–1–07, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–2–04.

టెక్నికల్‌ అసిస్టెంట్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
    వయసు: 28ఏళ్లు మించకూడదు.

టెక్నికల్‌ ఆఫీసర్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/తత్సమాన, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–1: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
    వయసు: 35 ఏళ్లు మించకూడదు.

సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–2: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి టెక్నికల్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా; సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–1,2 పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 30.04.2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
► వెబ్‌సైట్‌: www.ngri.org.in 


డబ్ల్యూడీసీడబ్ల్యూలో 42 అంగన్‌వాడీ టీచర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ హైదరాబాద్‌ పరిధిలో గల ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 42
► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఐసీడీఎస్, చార్మినార్‌–08, ఐసీడీఎస్, గోల్కొండ–10, ఐసీడీఎస్, ఖైరతాబాద్‌–10, ఐసీడీఎస్, నాంపల్లి–09, ఐసీడీఎస్, సికింద్రాబాద్‌–05.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.05.2021
► వెబ్‌సైట్‌: http://wdcw.tg.nic.in 

SBI Recruitment 2021: బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు 30వేల వేతనం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు