ఉస్మానియాలో ‘శవాలపై పైసలు’.. మార్చురీ సిబ్బంది జులుం

31 May, 2022 10:23 IST|Sakshi

హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలోని దారుణమైన పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. శవం విషయంలో మార్చురీ  సిబ్బంది లంచం డిమాండ్‌ చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించింది.  

చాదర్‌ఘాట్‌లో ఆర్థిక ఇబ్బందులతో మజీద్‌ అనే వ్యక్తి సూసైడ్‌  చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీద్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే.. రూ. వెయ్యి ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని మార్చురీ సిబ్బంది చెప్పడంతో గొడవ మొదలైంది. 

వెయ్యి రూపాయలు డిమాండ్‌ చేస్తూ మృతుడి బంధువులతో గొడవకు దిగారు. వాళ్లపై జులుం ప్రదర్శించారు. తాగిన మత్తులో మార్చురీ సిబ్బంది వీరంగం సృష్టించారు. బంధువులతో వాగ్వివాదానికి దిగిన మార్చురీ సిబ్బంది వ్యవహారంతో ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు