Osmania University: గ్లోబల్‌ ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ఎ‍ప్పుడంటే..

30 Dec, 2022 14:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జనవరి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ వెల్లడించారు. గురువారం ఓయూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేళంలో ఆయన మట్లాడారు.

ఓయూ క్యాంపస్‌ ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగే ఉస్మానియా గ్లోబల్‌ అలుమ్నీ మీట్‌–23లో హాజరయ్యేందుకు ఇప్పటికే వెయ్యి మంది పూర్వ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయం చరిత్రలో విభాగాల వారీగా పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారని వివరించారు. 

రెండు రోజుల పాటు సమ్మేళనం ఇలా.. 
గ్లోబల్‌ అలుమ్ని మీట్‌  జనవరి 3న మధ్యాహ్నం ప్రారంభమవుతుందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి, ఇతర అంశాలపై విశిష్ట పూర్వ విద్యార్థులతో పలు బృందలతో చర్చలు ఉంటాయన్నారు. సాయంత్రం యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లోని లాన్‌లో సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

రెండో రోజున పూర్వ విద్యార్థులు ఆయా విభాగాలను సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో  కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారన్నారు. మధ్యాహ్నం వివిధ అంశాలపై ఉపన్యాసాలుంటాయని వివరించారు. (క్లిక్‌ చేయండి: ప్రయాణికులకు ఊరట.. పోలీసుల కీలక ఆదేశాలు)

మరిన్ని వార్తలు