Hyderabad: శ్వాస సమస్యలకు చెక్‌.. ఈ వ్యాక్సిన్‌ వేయించారా?

18 Aug, 2021 20:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బంగారు బాల్యానికి టీకా..

శ్వాస సమస్యలకు చెక్‌ 

నేటి నుంచే న్యుమోనియా టీకా 

 0–5 వయసు పిల్లలు అర్హులు 

జోన్‌ పరిధిలో దాదాపు 28 వేల చిన్నారులు 

బంజారాహిల్స్‌: వర్షాకాలం, శీతాకాలంలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా న్యుమోనియాతో బాధపడుతుంటారు. చిన్నారులు శ్వాస ఆడక విలవిల్లాడుతుంటారు.. ఇలాంటి వారికి సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. పిల్లల్లో శ్వాసకోశ సమస్యల నివారణకు న్యుమోకాకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌(పీసీవీ) పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధమయ్యారు. 0–5 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయనున్నారు. ప్రస్తుతం ఈ టీకా ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే లభ్యమవుతోంది. ఒక్కో డోసు ఖరీదు రూ.2,800 నుంచి రూ.3,800 వరకు ఉంటుంది.  

ఈ టీకా పంపిణీలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రెహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్, వెంగళరావునగర్, అమీర్‌పేట డివిజన్ల పరిధిలోని 11 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ డివిజన్లలో 28వేల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18 నుంచి టీకా ప్రక్రియను అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రారంభించనున్నారు.  

చదవండి: హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్‌, సామూహిక అత్యాచారం

వ్యాధుల కట్టడికి.. 
న్యుమోకాకల్‌ అనేది స్ట్రెప్టోకోకస్‌ న్యుమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహం. వీటిని అధిగమించడానికి ఈ టీకా వేస్తారు. పిల్లల్లో అంటు వ్యాధులు సోకకుండా ఇది అడ్డుకుంటుంది. న్యుమోనియా మెనింజిటిస్‌ వంటి వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేస్తుంది. పీసీవీ గురించి ఇప్పటికే ఆయా ఆరోగ్య కేంద్రాల నర్సులు, వైద్యాధికారులు, ఆశ వర్కర్లు విస్తృత ప్రచారం చేపట్టారు. పీహెచ్‌సీల వారీగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీ వైద్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేస్తారు. టీకాల కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.  

ఆలస్యమైతే నష్టమే.. 

  • శిశువు పుట్టిన ఏడాదిలోగా తప్పనిసరి టీకా ఇ వ్వాల్సి ఉంటుంది. ప్రతి డోస్‌లోనూ 0.5 మి.లీ. మోతాదు వ్యాక్సిన్‌ ఇస్తారు. ఒకవేళ ఆలస్యమైతే మొదటి పుట్టిన రోజుకు ముందు కనీసం ఒక మో తాదు పీసీవీ వేసి ఉంటే మిగతా వాటిని ఇవ్వొచ్చు.  
  • పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఆలస్యమైతే కనిష్టంగా 8 వారాల వ్యవధిలో వేరు చేసి తదుపరి డోసు షెడ్యూల్‌ ఇమ్యునైజేషన్‌ సందర్శనలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ వందశాతం సురక్షితం. తల్లిపాలు, పోషకాహారం లేని పిల్లలకు ఈ వ్యాధి అధికంగా సోకే అవకాశం ఉంటుంది.  
  • ప్రభుత్వం ఉచితంగా అందించే టీకాను సద్వినియోగం చేసుకోవాలి. చిన్నారులకు టీకాలు అందేలా అధికారులు చొరవ చూపుతున్నారు. ఆరు వారాల వయసులో మొదటి డోసు, 14 వారాల వయసులో రెండో డోసు, 9 నెలల్లో బూస్టర్‌ డోసును చిన్నారులకు వేస్తారు.  

తల్లిదండ్రుల్లో అవగాహన అవసరం 
పీసీవీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతోంది. పిల్లలకు రొటీన్‌గా ఇస్తున్న టీకాలకు ఇది అదనం. 0–5 ఏళ్లలోపు పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ కల్పిస్తుంది. పిల్లలకు పీసీవీ ఇప్పించడంలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. అందుకే వారికి అవగాహన క లిగించాం. నెలన్నర క్రితం పుట్టిన పిల్లలను పీసీవీ వే యడానికి పరిగణలోకి తీసుకుంటాం. ఈ వ్యాక్సిన్‌ తీ సుకున్న పిల్లలకు ఐదేళ్ల వరకు న్యుమోనియా రాదు. రక్తహీతన నివారణకు కూడా దోహదపడుతుంది. – డాక్టర్‌ షీమా రెహమాన్, వైద్యాధికారిణి, 

బంజారాహిల్స్‌ యూపీహెచ్‌సీ 
అన్ని ప్రభుత్వ సెంటర్‌లలో.. ఏడాదిలోపు చిన్నారుల్లో న్యూ మోనియా వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘న్యూ మోకోకాల్‌’ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను అన్ని యూపీహెచ్‌సీ సెంటర్‌లలో నేటినుంచి పంపిణీ చేస్తున్నారు. 80శాతం మంది పిల్లల్లో ‘స్ప్రెక్టోకోకస్‌’ అనే బాక్టిరియా కారణంగా న్యూమోనియా సోకుతుంది. దీన్ని నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ సెంటర్‌లలో వ్యాక్సిన్‌ను ఇస్తారు.  – డాక్టర్‌ దీప్తి ప్రియాంక మంచాల, మెడికల్‌ ఆఫీసర్, బొగ్గులకుంట యూపీహెచ్‌సీ సెంటర్‌   

మరిన్ని వార్తలు