జర చూస్కో! మాస్కు లేకుంటే 1000 పడుద్ది

10 Apr, 2021 09:47 IST|Sakshi

రూ.వెయ్యి జరిమానా విధిస్తున్న పోలీసులు 

చెల్లించకపోతే వారెంట్‌ జారీ 

కరోనా వ్యాప్తి దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు 

ప్రతిరోజూ వేర్వేరు చోట్ల తనిఖీలు 

బంజారాహిల్స్‌: కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. మాస్‌్కలు లేకుండా తిరుగుతున్న వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రతిరోజూ ఒక్కో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మాస్‌్కలు ధరించకుండా తిరుగుతున్న వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్‌లైన్‌లో జరిమానా రశీదును అందజేస్తున్నారు. చెల్లించని వారిని కోర్టులో ప్రవేశపెట్టి 51(ఏ) డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద వారెంట్‌ జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 

  • బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం నుంచి మాస్‌్కలు లేని వారికి జరిమానాలు విధించే స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. 
  • తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిత్యం రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. 
  • జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనూ స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గురువారం ఒక్కరోజే 220 మంది మాస్‌్కలు ధరించకుండా తిరుగుతున్నారంటూ వారికి జరిమానాలు వేశారు. 
  • మాస్‌్కలు ధరించకపోతే కరోనా విస్తరించే అవకాశం ఉందని ఒక వైపు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తుంటే చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తాజా తనిఖీల్లో బయటపడిందని పోలీసులు పేర్కొంటున్నారు. 
  • ముఖ్యంగా వాహనదారులు మాస్‌్కలు ధరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 
  • స్కూటరిస్ట్‌లు 50 శాతం మంది మాస్‌్కలు లేకుండానే దర్జాగా దూసుకుపోతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందన్నారు. 
  • ప్రస్తుతం రెండు చోట్ల నిర్వహిస్తున్న తనిఖీలు వచ్చే వారానికి నాలుగైదు చోట్ల నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 
    (చదవండి: తెలంగాణ: టెన్త్‌ పరీక్షలు అవసరమా?)
మరిన్ని వార్తలు